Ads

My Wet Lips 💋

ఎడాల్ఫ్ హిట్లర్ జీవిత చరిత్ర

ఎడాల్ఫ్ హిట్లర్ సంగ్రహ జీవిత చరిత్ర

ఎడాల్ఫ్ హిట్లర్ లేదా అడాల్ఫ్ హిట్లర్ (Adolf Hitler) (జననం: 20 ఏప్రిల్ 1889 - మరణం: 30 ఏప్రిల్ 1945) 1933 నుండి జర్మనీ ఛాన్స్ లర్ గాను 1934 నుండి మరణించే వరకు జర్మనీ నేత(ఫ్యూరర్ fuhrer) గాను వ్యవహరించిన వ్యక్తి. ఇతడు నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ (దీనినే నాజీ పార్టీ అంటారు) వ్యవస్థాపకుడు.

                 మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ ఆర్థికముగా, సైనికముగా భారీగా నష్టపోయింది. హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన సైనికుడు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీపై మిత్ర రాజ్యాలు విధించిన ఆంక్షలు హిట్లర్ లోని అతివాదిని మేలు కొలిపాయి. ఈ విపత్కర పరిస్థితులను హిట్లర్ తనకు అనుకూలంగా మలచుకొన్నాడు. అణగారిన మధ్య తరగతి ప్రజలను హిట్లర్ తన వాక్పటిమతో ఉత్తేజితులను చేసాడు. జర్మనీ పతనానికి యూదులే ముఖ్య కారణమని హిట్లర్ బోధించాడు అతని ఉపన్యాసాలలో ఎప్పుడూ అతివాద జాతీయత, యూదు వ్యతిరేకత, సోషలిస్ట్ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపించేవి. అధికారం లోకి వచ్చిన తరువాత పతనమైన ఆర్థిక వ్యవస్థను నిస్తేజంగా ఉన్న సైనిక వ్యవస్థను గాడి లోకి తెచ్చాడు. ఇతని విదేశాంగ విధానం నియంతృత్వము, ఫాసిస్ట్ ధోరణి తోనూ నిండి ఉండేది. ఇతని విదేశాంగ విధాన లక్ష్యం జర్మనీ దేశ సరిహద్దులను పెంచడమే. ఇదే ధోరణి తో ఇతడు ఆస్ట్రియా, పోలండ్, చెక్ రిపబ్లిక్ లపై దండెత్తాడు. ఇదే రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీసింది.



రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం లో అక్ష రాజ్యాలు(Axis powers) దాదాపు యూరప్ ను జయించాయి. కానీ క్రమంగా మిత్ర రాజ్యాల చేతిలో ఓడిపోయాయి. హిట్లర్ జాతి వ్యతిరేక విధానాల వలన యుద్ధం పూర్తి అయ్యేసరికి సుమారుగా 1.1 కోట్ల ప్రజలు మరణించారు. వీరిలో 60 లక్షల మంది యూదులు. దీనిని చరిత్రలో మానవ హననం (హోలోకాస్ట్)గా పేర్కొంటారు.

యుద్ధపు చివరి రోజులలో సోవియట్ రష్యా కు చెందిన రెడ్ ఆర్మీ బెర్లిన్ నగరం లోనికి ప్రవేశించగానే హిట్లర్ ఆ ముందురోజే వివాహం చేసుకున్న తన భార్య ఇవా బ్రౌన్ తో కలిసి ఒక నేలమాళిగలో ఏప్రిల్ 30, 1945 మధ్యాహ్నం 3.30 కి ఆత్మ హత్య చేసుకొన్నాడు.





బాల్యము మరియు వంశ వివరాలు

అడాల్ఫ్ హిట్లర్ ఏప్రిల్ 20, 1889 న బ్రౌనౌ అం ఇన్ అనే గ్రామంలో ఆస్ట్రియా దేశంలో జన్మించాడు ఈ గ్రామం ఎగువ ఆస్ట్రియా, జర్మనీ దేశ సరిహద్దులలో ఉంది. ఆరుగురు పిల్లలలో హిట్లర్ నాలుగోవవాడు మరియు మూడవ మగ బిడ్డ. హిట్లర్ తండ్రి అలోఇస్ హిట్లర్ (అసలు పేరు శ్చిక్క్ల్ గ్రుబర్) వాణిజ్య శాఖలో గుమాస్తా. హిట్లర్ తల్లి క్లారా పోల్జ్ (1860–1907), అలోఇస్ కు రెండవ మరదలు మరియు మూడవ భార్య. వీరికి కలిగిన ఆరుగురు సంతనంలో హిట్లర్ మరియు అతని చెల్లెలు పౌలా మాత్రమే బతికారు. అలోఇస్ జూనియర్, ఏంజెలా, ఈ ఇద్దరు అలోఇస్ కు రెండవ భార్య వలన కలిగిన సంతానం. అలోఇస్ మొదటి భార్యకు పిల్లలు లేరు.

అలోఇస్ హిట్లర్ (హిట్లర్ తండ్రి) ఆక్రమ సంతానం. తన జీవితపు తొలి 39 సంవత్సరాలు అతడు తన తల్లి ఇంటి పేరునే తన ఇంటి పేరుగా చేర్చుకున్నాడు. 1876 లో జనాభా లెక్కల ప్రకారం ఒక గుమస్తా ఇతని సవతి తండ్రి 'జోహాన్న్ గెఒర్గ్ హైడ్లార్' ను అలోఇస్ తండ్రిగా పేర్కొన్నాడు. ఆ పేరు రకరకాలుగా పిలవబడి చివరకు 'హిట్లర్' గా స్థిరపడింది. పురాతన జర్మన్ భాషలో 'హిట్లర్' అంటే గుడిశె లో నివసించే వాడని అర్థం. తరువాత సంవత్సరాలలో హిట్లర్ తన శత్రువుల చేతిలో ఈ విషయంలో హేళనకు గురయ్యాడు.



NAME:                                      Adolf Hitler
OCCUPATION:                        Military Leader, Dictator
BIRTH DATE:                           April 20, 1889
DEATH DATE:                          April 30, 1945
PLACE OF BIRTH:                   Braunau am Inn, Austria
PLACE OF DEATH:                 Berlin, Germany
NICKNAME:                            Der Führer ("The Leader")




-->